జుక్కల్ నియోజకవర్గం

ఫీజు బకాయిలు విడుదల చేయాల్సిందే!

✍️ V59 News07.09.2026 · 9:54 pm👁️ 38 వ్యూస్

అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యువమోర్చా యత్నం.. అడ్డంకులు, అరెస్టులను దాటుకుని నిరసన

హైదరాబాద్‌: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ యువమోర్చా చేపట్టిన ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ముట్టడికి నాయకులు తరలివెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడ్డంకులు, అరెస్టులను దాటుకుంటూ నాయకులు అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.

కామారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా నాయకుడు బుడల గంగారాజు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడవద్దని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని తెలిపారు.