Breaking News

ఈనెల 30న హసన్ టాక్లికు మందకృష్ణ మాదిగ రాక

✍️ V59 News28.08.2026 · 5:42 pm👁️ 13 వ్యూస్

డోంగ్లి మండలం: హసన్ టాకిలి గ్రామంలో ఈనెల 30న నిర్వహించనున్న అన్న బహుసాటే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అభినవ అంబేద్కర్, సామాజిక ఉద్యమ నేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు MRPS మద్నూర్ మండలం సీనియర్ నాయకుడు సూర్యవంశీ యాదవ్ తెలిపారు.
ఈ సందర్భంగా సూర్యవంశీ యాదవ్ మాట్లాడుతూ.. అన్న బహుసాటే ఆశయాలు, సామాజిక సేవలను స్మరించుకుంటూ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ రానుండటంతో MRPS నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
మందకృష్ణ మాదిగకు హసన్ టాకిలి గ్రామంలో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సూర్యవంశీ తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.