జుక్కల్ నియోజకవర్గం

ఆర్టీసీ బస్సు ప్రమాదంపై అరుణ తార దిగ్భ్రాంతి

✍️ V59 News04.09.2026 · 4:02 pm👁️ 102 వ్యూస్

జుక్కల్: జుక్కల్ మండలం జుక్కల్ చౌరస్తా వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే అరుణ తార తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు గాయపడిన విషయం తెలుసుకుని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రుల వివరాలను తెలుసుకుని, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని అరుణ తార కోరారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించి, బాధితులకు తగిన ఆర్థిక సహాయం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.