జుక్కల్ నియోజకవర్గం

బిచ్కుంద MRPS అధ్యక్షుడిగా మేత్రి హన్మాండ్లు

✍️ V59 News01.09.2026 · 8:02 pm👁️ 20 వ్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) మండల అధ్యక్షుడిగా మేత్రి హన్మాండ్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా కమిటీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సమాజ సేవే లక్ష్యంగా, ఎమ్మార్పీఎస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ సంఘం బాధ్యతను మరింత పెంచేలా చిత్తశుద్ధితో పని చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మండల అభివృద్ధికి, సంఘం బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఆయన నియామకం పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.