జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తార పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి జన్మదినమైన జన్మాష్టమి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు. ధర్మాన్ని కాపాడుతూ, అధర్మాన్ని నిర్మూలించిన శ్రీకృష్ణుడి బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో జుక్కల్ నియోజకవర్గ ప్రజల కుటుంబాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో జీవించాలని అరుణ తార ఆకాంక్షించారు.
జుక్కల్ నియోజకవర్గం
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు: మాజీ ఎమ్మెల్యే అరుణాతార






