జుక్కల్ నియోజకవర్గం

జుక్కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

✍️ V59 News28.08.2026 · 4:05 pm👁️ 5 వ్యూస్

జుక్కల్: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆయన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన పేద కుటుంబాలకు సుమారు 87 వేల స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే చేరాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.