జుక్కల్ నియోజకవర్గం

రాఖీ పండుగ శుభాకాంక్షలు : మాజీ ఎమ్మెల్యే అరుణాతార

✍️ V59 News28.08.2026 · 9:54 am👁️ 5 వ్యూస్

జుక్కల్:అన్నాచెల్లెళ్ల అపురూప అనుబంధానికి, పవిత్రమైన ప్రేమకు ప్రతీక అయిన రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) పర్వదినాన్ని పురస్కరించుకుని జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు, సోదర సోదరీమణులకు మాజీ శాసనసభ్యురాలు అరుణాతర హృదయపూర్వక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా మానవ సంబంధాలను బలోపేతం చేసే గొప్ప పండుగ రాఖీ అని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పౌర్ణమి సుఖశాంతులను, ఐశ్వర్యాన్ని నింపాలని, అక్కాచెల్లెళ్లందరికీ సోదరులు ఎల్లప్పుడూ రక్షణగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.