జుక్కల్ నియోజకవర్గం

శ్రీ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు

✍️ V59 News30.08.2026 · 7:47 pm👁️ 19 వ్యూస్

బిచ్కుంద, ఆగస్టు 30: పవిత్ర రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక బ్రహ్మకుమారీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో భాగంగా బ్రహ్మకుమారీస్ కేంద్రంలో ఆధ్యాత్మిక జ్ఞానం, రాజయోగ ధ్యానం ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ సోదరీమణులు భక్తులు, ప్రజలకు ఈశ్వరీయ స్మృతితో పవిత్ర రాఖీలు కట్టి ఆధ్యాత్మిక బలాన్ని, శుభాకాంక్షలను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని రాఖీ పండుగ విశిష్టతను తెలుసుకున్నారు.