జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కేజీబీవీ పాఠశాల గ్రౌండ్‌లో ఉపాధి హామీ నిధులతో ఇంకుడు గుంతను నిర్మించారు. పాఠశాల ప్రాంగణంలో వర్షపు నీరు వృథా కాకుండా భూగర్భ జలాలను పెంపొందించాలనే ఉద్దేశంతో గ్రామపంచాయతీ పాలకవర్గం ఈ తీర్మానం చేసింది.
ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి ఇంకుడు గుంత నిర్మాణ పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వి. రమణ సురేష్, ఉప సర్పంచ్ అనిల్ కుమార్, వార్డ్ సభ్యులు నాగనాథ్ తదితరులు పాల్గొని పనులను పర్యవేక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






