జుక్కల్: జుక్కల్ నియోజకవర్గంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
జుక్కల్ మండల కేంద్రంలో ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా జామియా మసీదు నుంచి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఖాతిజా మసీదు వరకు కొనసాగి, తిరిగి జామియా మసీదు వద్దకు చేరుకుంది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చూపిన శాంతి, ప్రేమ, సోదరభావం, మానవత్వం, పరస్పర గౌరవం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. పవిత్ర పర్వదినం ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఐక్యత, ఆరోగ్యం, అభివృద్ధిని నింపాలని ఆకాంక్షించారు. జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు.
కార్యక్రమంలో జుక్కల్ గ్రామ సర్పంచ్ శ్రీమతి సావిత్రి సాయగౌడ్, బస్వపూర్ గ్రామ సర్పంచ్ డబ్ల్యూ. రమణ సురేష్ గొండ, డీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్, జుక్కల్ ఉపసర్పంచ్ షేక్ ఫిర్దోస్, మైనారిటీ అధ్యక్షుడు షాదుల్, మీలాద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ షాఖిల్, మత పెద్దలు, చిన్నారులు, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.



