బీర్కూర్: బీర్కూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా రేంజర్ల అనిల్, ప్రధాన కార్యదర్శిగా కవిత పండరి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు అరిగే ధర్మతేజ మాట్లాడుతూ.. బీర్కూర్ మండలంలోని సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని తెలిపారు. సర్పంచుల హక్కులు, గ్రామాల అభివృద్ధి కోసం ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సుధరణి రాములు, కవిత పండరి, శ్రీనివాస్, రమేష్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు



