కామారెడ్డి

“నా బిడ్డ పెళ్లి ఉంది.. పార్టీలకు అతీతంగా రావాలి” — పిలిచి అరెస్ట్ చేయడం సిగ్గుచేటు!

✍️ V59 News16.08.2026 · 1:58 pm👁️ 6 వ్యూస్

మద్నూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అరెస్ట్.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేవన్‌ మండిపాటు

మద్నూర్‌: “నా బిడ్డ పెళ్లి ఉంది.. పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఆశీర్వదించాలి” అంటూ జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  ఇంటింటికీ  వివాహ ఆహ్వాన పత్రికలు అందించారని బీజేపీ ఎస్సీ మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రేవన్ అన్నారు.

అలా పెళ్లికి ఆహ్వానించి.. ఇప్పుడు అదే నాయకులను అరెస్ట్ చేయడం ఏంటని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డ పెళ్లి ఉందని చెప్పి పిలిచి.. అరెస్టులు చేయడం సిగ్గుచేటని రేవన్‌ మండిపడ్డారు.

పెళ్లి పత్రిక చేతిలో పెట్టి.. పెళ్లికి రమ్మన్నారు. పార్టీలకు అతీతంగా వచ్చి ఆశీర్వదించాలన్నారు. మరి ఇప్పుడు అదే వ్యక్తులను పోలీసులతో అరెస్ట్ చేయించడం ఏంటి? ఇదేనా రాజకీయ సంస్కృతి?” అంటూ రేవన్‌ ప్రశ్నించారు.

బీజేపీ నాయకులను, బీఆర్‌ఎస్‌ నాయకులను శుభకార్యానికి ఆహ్వానించి.. మరోవైపు వారిపై పోలీసు చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని ఆయన విమర్శించారు.

“రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి.. శుభకార్యాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఆడబిడ్డ పెళ్లిని చెప్పి పిలిచి.. అదే పేరుతో వచ్చిన వారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం?” అని రేవన్‌ నిలదీశారు.

ఈ ఘటనలో భాగంగా మద్నూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. అరెస్టులపై ప్రభుత్వం, పోలీసులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పెళ్లికి ఆహ్వానం ఇచ్చిన చేతులతోనే.. అరెస్టులకు కారణమయ్యే పరిస్థితులు రావడంపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోందని, “పిలిచింది పెళ్లికా.. అరెస్ట్ చేయడానికా?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని రేవన్‌ పేర్కొన్నారు.

ఆడబిడ్డ పెళ్లి పేరుతో పిలిచి.. అరెస్ట్ చేయడం రాజకీయాలకు అతీతంగా ఆలోచించే ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అంశమని ఆయన అన్నారు.