కామారెడ్డి

పోచారం డ్యామ్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

✍️ V59 News26.08.2026 · 6:04 pm👁️ 6 వ్యూస్

నాగిరెడ్డిపేట: పోచారం డ్యామ్‌ను పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం డ్యామ్‌ను సందర్శించిన ఆయన, అక్కడి పర్యాటక అభివృద్ధి అవకాశాలను పరిశీలించారు.

డ్యామ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు బోటింగ్ సౌకర్యం, హరిత ప్రాంతాలు, పిల్లల ఆట స్థలాలు, వీక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, పోచారం డ్యామ్‌ను ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.