జిల్లా వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తున్న కౌన్సిలర్

✍️ V59 News25.08.2026 · 7:31 pm👁️ 19 వ్యూస్

బిచ్కుంద, ఆగస్టు 25:
బిచ్కుంద మున్సిపాలిటీ 3వ వార్డులో ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సిలర్ ధర్పల్ కార్తీక సంతోష్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. వార్డులోని తాగునీటి ట్యాంకు వద్ద పరిస్థితులను పరిశీలించి, నీటి వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందితో మాట్లాడారు.
ట్యాంకు పరిసరాల్లో నీరు నిల్వ ఉండటం, పారిశుధ్య సమస్యలను గుర్తించిన కౌన్సిలర్.. పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజల మధ్యే ఉంటూ.. సమస్యలను స్వయంగా పరిశీలిస్తూ
వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను గుర్తించడమే కాకుండా, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ముందుండి పనిచేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
3వ వార్డు అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కౌన్సిలర్ ధర్పల్ కార్తీక సంతోష్ తెలిపారు.