ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలం నెమలీ గ్రామానికి చెందిన పందిరి అంజవ్వ, తీర్లపురం సాయిలు అనారోగ్య పరిస్థితులతో ఇబ్బందిపడుతూ సాయం కోరగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ మేరకు వారు క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో చెక్కులను అందుకున్నారు.
ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
బాన్సువాడ నియోజకవర్గం
ఆర్మూర్‌లో CMRF చెక్కుల పంపిణీ




