బాన్సువాడ నియోజకవర్గం

మాజీ సర్పంచ్ వెంకన్న కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం

✍️ Kummari Shankar31.08.2026 · 10:15 am👁️ 9 వ్యూస్

తగిలేపల్లి, ఆగస్ట్ 31: కష్టకాలంలో ఉన్న కుటుంబానికి మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భరోసానిచ్చారు. తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వెంకన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే విషయం తెలుసుకున్న ఆయన, వెంటనే స్పందించి తన సొంత డబ్బులతో రూ. 1 లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా తగిలేపల్లి గ్రామ ప్రజలు పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే గొప్ప నాయకుడని గ్రామస్తులు కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న సేవలు మరువలేనివని, ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి నాయకుడిని చూడలేమని తమ అభిమానాన్ని చాటుకున్నారు.