బాన్సువాడ నియోజకవర్గం

కిష్టాపూర్‌లో ఘనంగా వన మహోత్సవం

✍️ Kummari Shankar25.08.2026 · 10:27 pm👁️ 4 వ్యూస్

 

కిష్టాపూర్: గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మనెవ్వ, ఉపసర్పంచ్ అట్కరి కృష్ణ, వార్డు మెంబర్ వంగరి కృష్ణ, గుల్ల గోపాల్, కుమ్మరి భాగ్య,ఉపాధ్యాయులు, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌తో పాటు గ్రామ రైతులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వన మహోత్సవంలో భాగంగా గ్రామంలోని పాఠశాల పరిసరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో పలు రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, గ్రామంలో పచ్చదనం పెంచేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, అవి పెద్ద చెట్లుగా ఎదిగేలా చూడాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.

మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని వారు పేర్కొన్నారు. గ్రామంలోని పాఠశాల పరిసరాలు పచ్చదనంతో కళకళలాడేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.