కామారెడ్డి

సీఎం పర్యటన పేరుతో అరెస్టులా?

✍️ V59 News16.08.2026 · 10:48 am👁️ 1 వ్యూస్

టీఆర్‌పీ జుక్కల్ ఇన్‌చార్జి జాదవ్ ఈశ్వర్ ప్రశ్న

బిచ్కుంద: కందర్పల్లి డీబీఎల్ ప్రాంగణంలో జరుగుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో టీఆర్‌పీ జుక్కల్ నియోజకవర్గ ఇన్‌చార్జి జాదవ్ ఈశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ.. “సీఎం పర్యటన ఉందనే కారణంతో నన్ను అరెస్ట్ చేయడం ఇదేం సంస్కృతి?” అని ప్రశ్నించారు. తాను ఎలాంటి శాంతిభద్రతల సమస్యకు కారణం కాకపోయినా ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.

ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేయడం సరికాదని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కులను గౌరవించాలని ఆయన అన్నారు.