పెద్ద కొడప్ గల్ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని డీబీఎల్ ప్రాంగణంలో జరగనున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కూతురి వివాహ వేడుకకు పెద్దకొడంగల్ మండల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ పెద్దకొడంగల్ మండల అధ్యక్షుడు శ్యామ్ పటేల్ కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వివాహ వేడుకకు పెద్దకొడంగల్ మండలంలోని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నట్లు శ్యామ్ పటేల్ తెలిపారు.





