కామారెడ్డి

బాన్సువాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

✍️ Kummari Shankar15.08.2026 · 3:15 pm👁️ 12 వ్యూస్

తేదీ: 15 ఆగస్టు 2026 | బాన్సువాడ పట్టణం

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ బాన్సువాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత తన స్వగృహం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు వందనం చేశారు.

అనంతరం శాసనసభ్యులు, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి బాన్సువాడ పట్టణంలోని ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల తదితర ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా కాసుల బాలరాజ్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి పోరాట స్ఫూర్తితో ప్రజాసేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో బాన్సువాడ ఆర్డీవో శ్రీ రవీందర్ రెడ్డి, బాన్సువాడ డీఎస్పీ శ్రీ విఠల్ రెడ్డి, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

 

V59 NEWS | బాన్సువాడ