దేశాయిపేట్: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేశాయిపేట్‌లోని ZPHS హైస్కూల్‌లో విద్యార్థులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు జాతీయ జెండాలను అందజేస్తూ దేశభక్తి, జాతీయ ఐక్యత భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో D. సాయి ప్రసాద్, K. శివ కుమార్, T. హనుమాన్లు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.



