ఎల్లారెడ్డి నియోజకవర్గం

పేదల గుండెల్లో చెరగని ముద్ర.. వైఎస్సార్‌కు ఘన నివాళి

✍️ Journalist Kummari Srinivas02.09.2026 · 6:27 pm👁️ 10 వ్యూస్

సంక్షేమ పాలనకు చెరగని సంతకంగా, పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలు చిరస్మరణీయమని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ ఆదేశానుసారం.. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం: నాయకులు

​ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు సహా అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో చారిత్రాత్మక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.