క్రీడలు

పంచాయతీ ఆవరణలో ఇంకుడు గుంతకు ముగ్గు వేసిన సర్పంచ్ అరిగే ధర్మతేజ…

✍️ Kummari Shankar23.07.2026 · 7:12 pm👁️ 6 వ్యూస్

ఇంకుడు గుంతలకు ముగ్గు వేసిన సర్పంచ్ అరిగే ధర్మతేజ…

బీర్కూరు: మండల కేంద్రంలో ఒక గ్రామ పంచాయతీ ఆవరణలో ఇంకుడు గుంతకు ముగ్గు వేసిన సర్పంచ్ ధర్మతేజ, mdo మెహబూబ్.NREGS నిధుల కింద బోర్వెల్ రీఛార్జ్ ఇంకుడు గుంతలు ముగ్గు వేసి ప్రారంభించడం జరిగింది. సర్పంచ్ ధర్మ తేజ మాట్లాడుతూ ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది.అలాగే వాటర్ స్టోరేజ్ నిలువ ఉండడం జరుగుతుంది బోర్వెల్ దగ్గర గాని ఇంటి ఆవరణలో గాని ఇంకుడు గుంతలు ఉంటే చాలా మంచిదని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ అరిగే ధర్మ తేజ, mpo మెహబూబ్, ఉప సర్పంచ్ పరమేష్, సెక్రెటరీ గంగారం, జూనియర్ అసిస్టెంట్ హనుమంతరావు,పోతుల వెంకటేశo తదితరులు పాల్గొన్నారు.