విద్యా ఉద్యోగాలు

ఎల్లారెడ్డి : మెగా జాబ్ మేళాకు భారీ ఎత్తున అభ్యర్థులు..

✍️ Journalist Kummari Srinivas24.08.2026 · 6:35 pm👁️ 4 వ్యూస్

hi

*

*మెగా జాబ్ మేళాకు యువత నుంచి విశేష స్పందన*

*5 వేలకు పైగా యువతీ యువకులు పాల్గొన్నారు*

జాబ్ మేళా కార్యక్రమాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో, మదన్ మోహన్ ట్రస్ట్ నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా–2026, ఎల్లారెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది.

ఈ మెగా జాబ్ మేళాకు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల యువతీ వకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటికే 5 వేలకు పైగా యువతీ యువకులు పాల్గొన్నారు.

జాబ్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు సందర్శించి, వివిధ ప్రముఖ కంపెనీలు నిర్వహిస్తున్న ఉద్యోగ ఇంటర్వ్యూల ప్రక్రియను పరిశీలించారు. ఇంటర్వ్యూలకు హాజరైన యువతీ యువకులతో స్వయంగా మాట్లాడి, వారి విద్యార్హతలు, ఆసక్తులు, ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకున్నారు.