ప్రదేశం: బీర్కూర్ – బైరాపూర్
- నిండు కుండలా బైరాపూర్ చెరువు.. ఆనందంలో రైతన్నలు!
బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో వర్షపు నీటితో ప్రధాన చెరువు కళకళలాడుతోంది. ఎగువ ప్రాంతాల నీటి తాకిడికి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని, ప్రస్తుతం మత్తడి దుముకుతోంది. అలుగు పారుతున్న ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు గ్రామస్తులు విశేషంగా తరలివస్తున్నారు. రాబోయే పంట కాలానికి నీటి ఇబ్బందులు తీరినట్లేనని రైతాంగం తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తోంది.

