విలేకర్లు కావలెను
☎ 9490070605
కామారెడ్డి జిల్లా వార్తలు జుక్కల్ నియోజకవర్గం
V59 News 09-11-2026 www.v59news.co.in 3193

బిచ్కుందలో ఘనంగా దీపావళి లక్ష్మీ పూజలు

బిచ్కుంద: దీపావళి పండుగను పురస్కరించుకుని బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో నిర్వహించిన అమావాస్య లక్ష్మీ పూజల్లో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం పట్టణంలోని వ్యాపారస్తులను ఆప్యాయంగా పలకరించి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని, ప్రజలు, వ్యాపారస్తులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారస్తులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

76