డోంగ్లి: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు డోంగ్లి మండలం పెద్ద టాక్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన రిజ్వానాబీ, సందీప్ గైక్వాడ్‌లకు ఇంటి నిర్మాణం కోసం మార్కింగ్ వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్ గైక్వాడ్, ఉపసర్పంచ్ జాకీర్ ఖాన్, గ్రామపంచాయతీ కార్యదర్శి పండరి, వార్డు సభ్యులు షాదుల్ సాబ్, జిలానీ సాబ్, తరోటే సూర్యకాంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాదవరావు పటేల్, సాయలు గోండ, సాధక్ సాబ్, అబ్దుల్ సాబ్, యూసుఫ్ సాబ్, ఫకీర్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.
విలేకర్లు కావలెను
☎ 9490070605
పెద్ద టాక్లిలో ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్