విలేకర్లు కావలెను
☎ 9490070605
కామారెడ్డి జిల్లా వార్తలు జుక్కల్ నియోజకవర్గం
V59 News 06-11-2026 www.v59news.co.in 3159

జిల్లా స్థాయి కోకో పోటీల్లో ఆర్కిడ్స్ విద్యార్థుల సత్తా

బిచ్కుంద: 70వ ఎస్‌జీఎఫ్ (SGF) కామారెడ్డి జిల్లా స్థాయి కోకో పోటీల్లో బిచ్కుంద పట్టణంలోని ఆర్కిడ్స్ హైస్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు సత్తా చాటారు. ఎం. రూపేష్, కె. రోహన్ గౌడ్, యు. వర్ధన్ జిల్లా స్థాయి కోకో పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతి సాధించారు. విద్యార్థుల్లో ఎం. రూపేష్ రాష్ట్ర స్థాయి కోకో పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ విజేత విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ రూపేష్ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

14