విలేకర్లు కావలెను
☎ 9490070605
కామారెడ్డి జిల్లా వార్తలు జుక్కల్ నియోజకవర్గం
V59 News 06-11-2026 www.v59news.co.in 3153

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి వేడుకలు: సీఎం

హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగను జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2,25,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన నేపథ్యంలో లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి దీపాలు వెలిగించి పండుగ జరుపుకోనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆనందంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

15