విలేకర్లు కావలెను
☎ 9490070605
కామారెడ్డి జిల్లా వార్తలు బాన్సువాడ నియోజకవర్గం
Kummari Shankar 05-11-2026 www.v59news.co.in 3151

జంపాల 50వ వర్ధంతి.. బోధన్‌లో భారీ విద్యార్థి ర్యాలీ

జంపాల చంద్రశేఖర ప్రసాద్ 50వ వర్ధంతి సందర్భంగా భారీ విద్యార్థి ర్యాలీ

బోధన్: PDSU నిర్మాత జంపాల చంద్రశేఖర ప్రసాద్ అమరత్వం పొంది 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బోధన్ పట్టణంలో భారీ విద్యార్థి స్ఫూర్తి ర్యాలీ నిర్వహించారు.

పట్టణంలోని శక్తి నగర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చారు. జంపాల చంద్రశేఖర ప్రసాద్ ఆశయాలను కొనసాగిస్తూ విద్యార్థి ఉద్యమ స్ఫూర్తిని చాటాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో PDSU నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

5