విలేకర్లు కావలెను
☎ 9490070605
కామారెడ్డి జిల్లా వార్తలు జుక్కల్ నియోజకవర్గం
V59 News 05-11-2026 www.v59news.co.in 3140

మహమ్మదాబాద్‌లో బోమ్ గోండా మహారాజ్ విగ్రహావిష్కరణ

జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామంలో ఈనెల 7న శ్రీ భోమ్ గోండా మహారాజ్ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు గ్రామస్తులు. గ్రామ గౌరవం, ఐక్యత, స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే శ్రీ భోమ్ గోండా మహారాజ్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌లను గ్రామస్తులు ఆహ్వానించారు.

ఈ మేరకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావుకు, డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కు ఆహ్వాన పత్రికలను గ్రామస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శకుంతల బాలు, కురుమ సంఘం అధ్యక్షుడు కండుగొండ అంజుగొండ మహారాజ్, హనుమకొండ బాలుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

62