బిచ్కుంద: SIR అంటే ఓటు హక్కును తొలగించే ప్రక్రియ మాత్రమే కాదని, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే ప్రక్రియ అని కామారెడ్డి జిల్లా BJYM జనరల్ సెక్రటరీ బుడాల గంగరాజు అన్నారు. BJYM ఆధ్వర్యంలో బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుడాల గంగరాజు మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేవన్, ముప్పిడి జ్ఞానేశ్వర్, రామాగౌడ్, మారుతి, చంద్రకాంత్ పాటిల్, లక్ష్మణ్ చారి తదితరులు పాల్గొన్నారు.
విలేకర్లు కావలెను
☎ 9490070605
జూనియర్ కళాశాలలో SIR పై విద్యార్థులకు అవగాహన