విలేకర్లు కావలెను
☎ 9490070605
జిల్లా వార్తలు జిల్లా వార్తలు వార్తలు
V59 News 05-11-2026 www.v59news.co.in 3120

దామోదర, లక్ష్మీకాంతారావుకు టీపీసీసీ పిలుపు

హైదరాబాద్: ఢిల్లీలో మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య చోటుచేసుకున్నట్లు ప్రచారంలో ఉన్న వాగ్వాదం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఇరువురు నేతలను గురువారం గాంధీభవన్‌కు హాజరుకావాలని ఆదేశించినట్లు సమాచారం. ఢిల్లీలో పార్టీ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో డీసీసీ అధ్యక్షుల నియామకాల అంశంపై ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో మంత్రి తనను దూషించి, బెదిరించారని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలతో మాట్లాడి వివాదానికి గల కారణాలను తెలుసుకోవాలని టీపీసీసీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. గాంధీభవన్‌లో జరిగే చర్చతో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

123