విలేకర్లు కావలెను
☎ 9490070605
కామారెడ్డి జిల్లా వార్తలు జుక్కల్ నియోజకవర్గం
V59 News 01-11-2026 www.v59news.co.in 3003

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రాజ్యాధికార పార్టీ అండ

జుక్కల్: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బస్వాపూర్ గ్రామానికి చెందిన జాలయ్య కుటుంబానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని జుక్కల్ నియోజకవర్గ ఇంచార్జి జాదవ్ ఈశ్వర్ తెలిపారు. జుక్కల్ మండల పరిధిలోని మహమ్మదాబాద్ కోళ్ల ఫారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్‌ను ఢీకొని జాలయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న జాదవ్ ఈశ్వర్ ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు మల్లన్నతో బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజినీకుమార్ మాధవ్‌తోనూ మాట్లాడించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పార్టీ తరఫున కృషి చేస్తామని జాదవ్ ఈశ్వర్ తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని, రాజకీయాలకు అతీతంగా న్యాయం జరిగే వరకు కుటుంబం పక్షాన నిలబడతామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో టీఆర్పీ నాయకులు కండేరావు, రాజు, ముదిరాజ్, రాజ్‌పాల్, ఈరన్న, మిలింద్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.

66