బిచ్కుంద: బిచ్కుంద మఠాధిపతి శ్రీశ్రీ సద్గురు సోమయప్ప స్వామి తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మున్నూరు నాగ్నాథ్, సర్పంచ్ లు అశోక్ పటేల్, జై పటేల్, రాజు పటేల్, సంతోష్ పటేల్, పుల్కల్ వెంకన్న , విశ్వనాథ్, సాయిని అశోక్, భూమయ్య, శంకర్ పటేల్, సంతోష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
విలేకర్లు కావలెను
☎ 9490070605
బిచ్కుంద మఠాధిపతికి కాంగ్రెస్ నాయకుల సన్మానం