బిచ్కుంద: మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో నెలకొన్న లో వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్ ముజాహిద్ కోరారు. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. నివాస ప్రాంతాల గుండా వెళ్తున్న విద్యుత్ లైన్లను తొలగించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన చోట 11 కేవీ హైటెన్షన్ లైన్, హైమాస్ట్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. లో వోల్టేజీతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
విలేకర్లు కావలెను
☎ 9490070605
విద్యుత్ లైన్లు మార్చాలని అధికారులకు వినతి