విలేకర్లు కావలెను
☎ 9490070605
కామారెడ్డి జిల్లా వార్తలు జుక్కల్ నియోజకవర్గం
V59 News 06-11-2026 www.v59news.co.in 3165

సీఎం, మంత్రికి సౌధగర్ అరవింద్ కృతజ్ఞతలు

జుక్కల్: వీరశైవ లింగాయత్ సమాజానికి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచేలా రంగారెడ్డి జిల్లా కోకాపేటలో బసవేశ్వర భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయడంపై జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సౌదగర్ అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోకాపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 240లో బసవేశ్వర భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించడం పట్ల వీరశైవ లింగాయత్ సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి, ఆత్మగౌరవానికి భవన్ నిర్మాణం దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నిధుల మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి, మంత్రికి మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు.

21