విలేకర్లు కావలెను
☎ 9490070605
కామారెడ్డి జిల్లా వార్తలు బాన్సువాడ నియోజకవర్గం
Kummari Shankar 05-11-2026 www.v59news.co.in 3137

గోవర్ధిని గోశాలకు రూ.10 వేల విలువైన పశుగ్రాసం విరాళం

బీర్కూర్: బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అయ్యప్ప గురుస్వామి గుడికొండ సుభాష్ గారు గోసేవలో భాగంగా సుమారు రూ.10,000 విలువైన పశుగ్రాసం (గడ్డి కట్టలు) అందజేశారు. బాన్సువాడ మండలం తీర్మలపూర్‌లోని గోవర్ధిని గోశాలకు ఈ పశుగ్రాసాన్ని పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాత గుడికొండ సుభాష్ గురుస్వామి, లయన్స్ జోన్ చైర్మన్ సీతలే రమేష్, లయన్స్ క్లబ్ సభ్యులు మేరు భరత్, అహ్మద్, కిషన్ సింగ్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోసేవకు ముందుకొచ్చి పశుగ్రాసం అందించిన గుడికొండ సుభాష్ గురుస్వామికి లయన్స్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

9