బిచ్కుంద: SIR అంటే ఓటు హక్కును తొలగించే ప్రక్రియ మాత్రమే కాదని, తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రధాన లక్ష్యమని బీజేపీ కామారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రేవన్ అన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు SIRపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు ఉండేలా ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో BJYM జిల్లా జనరల్ సెక్రటరీ బుడాల గంగరాజు, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేవన్, ముప్పిడి జ్ఞానేశ్వర్, రామాగౌడ్, మారుతి, చంద్రకాంత్ పాటిల్, లక్ష్మణ్ చారి తదితరులు పాల్గొన్నారు.
విలేకర్లు కావలెను
☎ 9490070605
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే SIR