విలేకర్లు కావలెను
☎ 9490070605
Breaking News జిల్లా వార్తలు వార్తలు
V59 News 05-11-2026 www.v59news.co.in 3104

దళితబంధు అవకతవకలపై ఏసీబీకి బోర్గి సంజీవ్ పిర్యాదు

హైదరాబాద్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా దళిత విభాగం అధ్యక్షుడు ఎం. సంజీవులు నవంబర్ 4న హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రధాన కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. పథకం అమలులో అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్ మండల కేంద్రంలో దళితబంధు పథకం అమలులో జరిగిన అవినీతిపై ఎన్నికల్లో గెలిచిన వెంటనే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గతంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయారని సంజీవులు ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

జుక్కల్ నియోజకవర్గంలో దళితబంధు పథకం కింద లబ్ధి పొందిన 1,536 మంది వివరాలను పరిశీలించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి కేటాయించిన రూ.10 లక్షల ఆర్థిక సాయం సక్రమంగా వినియోగించారా? లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు ఎలా జమయ్యాయి? పథకం కింద కొనుగోలు చేసిన వాహనాల వివరాలు, వాటి ఖర్చులు ఏమిటి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని ఏసీబీ అధికారులను కోరారు.

దళితబంధు పథకం అమలులో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంజీవులు విజ్ఞప్తి చేశారు.

59