విలేకర్లు కావలెను
☎ 9490070605
కామారెడ్డి జిల్లా వార్తలు జుక్కల్ నియోజకవర్గం
V59 News 04-11-2026 www.v59news.co.in 3086

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే

బిచ్కుంద: బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, అపజయాలకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. కళాశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా కళాశాలలో చేరిన విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శాలువాలతో సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ మాట్లాడుతూ విద్యతోనే జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ సీమ సెట్కార్, వైస్ ఛైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగనాథ్, బొగుడ మీద సాయిలు, అసద్ అలీ మరియు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

89