విలేకర్లు కావలెను
☎ 9490070605
కామారెడ్డి జిల్లా వార్తలు బాన్సువాడ నియోజకవర్గం
Kummari Shankar 04-11-2026 www.v59news.co.in 3017

బాన్సువాడను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

బాన్సువాడ పట్టణంలోని నాయి బ్రాహ్మణ ఫంక్షన్ హాల్‌లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుబాస్ రాములు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో కరువు తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి కేంద్రానికి నివేదిక పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బాన్సువాడ మున్సిపాలిటీలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసి గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు చెన్నంగారి సురేష్, తోట శ్రీనివాస్, సాయిలు, ఖాదర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

18