విలేకర్లు కావలెను
☎ 9490070605
కామారెడ్డి జిల్లా వార్తలు బాన్సువాడ నియోజకవర్గం
Kummari Shankar 05-11-2026 www.v59news.co.in 3013

నిలోఫర్‌లో చిన్నారులను పరామర్శించిన పోచారం

నవంబరు 2: బాన్సువాడ గ్రామీణ మండలం తాడ్కోల్‌ శివారులో పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలిన ఘటనలో గాయపడిన చిన్నారులను బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం నిలోఫర్‌ ఆసుపత్రిలో పరామర్శించారు. చికిత్స పొందుతున్న దండ్ల అంజలి (3), దండ్ల శ్రీదేవి (5) ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిలోఫర్‌ ఆర్‌ఎంఓ, సూపరింటెండెంట్‌, తాడ్కోల్‌ సర్పంచ్‌ రమేష్‌, మాజీ జడ్పీటీసీ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

4