ఢిల్లీలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ ర్యాలీకి పోచారం భాస్కర్ రెడ్డి హాజరు
బాన్సువాడ, నవంబర్ 1: ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సభకు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి తదితర ప్రముఖ నాయకులు పాల్గొన్న ఈ సభలో ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల పారదర్శకత కోసం నినదించారు.