బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
వధూవరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. సీఎం రాకతో వివాహ వేడుకకు ప్రత్యేక సందడి నెలకొంది. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.




