క్రీడలు

చందూర్ మండలంలో పెన్షన్ దరఖాస్తుల సమస్యపై BRS నేతల పోరాటం

✍️ Kummari Shankar13.08.2026 · 3:08 pm👁️ 2 వ్యూస్

అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో పెన్షన్ అందించాలి: BRS నేతల డిమాండ్

చందూర్: మండలంలోని అర్హులైన వృద్ధులు, వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియలో జాప్యం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని BRS నేతలు డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్ దరఖాస్తులకు అవసరమైన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ ఆలస్యం కారణంగా పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

కరేగావ్ తండా, లక్ష్మాపూర్, మేడిపల్లి తండా తదితర ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చందూర్ మండల తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ శ్రీ వీర్ సింగ్‌కు BRS నాయకులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ధరావత్ సురేష్ నాయక్, ధరావత్ కిట్టు, మూడ్ సంతోష్, అమ్గోత్ సర్దార్, రామావత్ పాండి తదితరులు మాట్లాడుతూ, “పెన్షన్ పేదల హక్కు. అధికారిక ప్రక్రియలో జాప్యం కారణంగా ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగకూడదు. చివరి తేదీ ముగిసేలోపు ప్రతి అర్హుడి దరఖాస్తు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి” అని కోరారు.

పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అర్హుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ సిబ్బంది, మీ-సేవా కేంద్రాల సిబ్బందితో సమన్వయం చేసి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని తహసీల్దార్ వీర్ సింగ్ హామీ ఇచ్చారు. సమస్యను సానుకూలంగా స్వీకరించి చర్యలకు హామీ ఇచ్చినందుకు BRS నాయకులు తహసీల్దార్‌ను శాలువాతో సన్మానించారు.అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందే వరకు ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని BRS నేత ధరావత్ సురేష్ నాయక్ స్పష్టం చేశారు. “పేదల హక్కుల కోసం – ప్రజల పక్షాన BRS పోరాటం కొనసాగుతుంది” అని అన్నారు.