ఎల్లారెడ్డి: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను పూర్తి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సూచించారు. మండలంలోని అన్నా సాగర్ గ్రామంలో నిర్వహించిన ఓటరు జాబితా సవరణ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని, క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందించారు.
అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, ప్రత్యేక బృందం సభ్యులు, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పట్టణ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ స్రవంతి గౌడ్, ఉప సర్పంచ్ నాగరాజు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కాశీరాం, AMC డైరెక్టర్ గంగారెడ్డి, గురు ప్రతాప్, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



