బిచ్కుంద: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలోని 3వ వార్డు ఎంపీపీఎస్ బోయివాడ, ఉర్దూ మీడియం పాఠశాలల్లో విద్యార్థులకు ప్యాడ్ పెన్నులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3వ వార్డు కౌన్సిలర్ దర్పల్ కార్తీక సంతోష్ హాజరై విద్యార్థులకు ప్యాడ్ పెన్నులు అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో దేశ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




