బిచ్కుంద, ఆగస్టు 4: రాష్ట్ర బీజేపీ యువమోర్చా (BJYM) ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని సద్గురు బండయప్ప స్వామి బీఈడీ కళాశాల మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం విద్యార్థుల సమస్యలపై బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేవైఎం నాయకుడు బుడాల గంగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల చెల్లింపులు ఆలస్యం కావడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే బీజేపీ యువమోర్చా ఊరుకోదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి బీజేవైఎం ఆధ్వర్యంలో ఉధృత పోరాటాలు చేపడతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ బిచ్కుంద మండల అధ్యక్షుడు శెట్పల్లి విష్ణు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి: బీజేవైఎం



