బిచ్కుంద, మార్చి 2026:మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీ రచ్చ జగన్నాథ్ స్మృతి సమితి ఆధ్వర్యంలో 10వ తరగతిలో మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా 570 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మౌలానా, బాలికల పాఠశాల విద్యార్థిని స్మిత, శాంతాపూర్ విద్యార్థిని చవాన్ సాత్విక, పెద్ద దడ్గి విద్యార్థినులు కళ్యాణి, శృతిక లకు నగదు బహుమతి, ప్రశంసాపత్రం, మెమెంటో మరియు మెడల్ అందజేసి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు విశ్వేశ్వరరావు, అక్తర్ బేగం, దత్తా గౌడ్, మనోహర్, సమితి సంయోజకులు రచ్చ శ్రీకాంత్, రచ్చ శివకాంత్, ఉపాధ్యాయులు చంద్ర శేఖర్, రాజ్ కుమార్, భూమన్న, దత్తు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ పురస్కారాల లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.




